గురువులకిదే మా వందనం

చదువు నేర్పే గురులకిదె మా వందనం
జ్ఞాన దాతల చరనధూళికి వందనం
శాంతమూర్తులు స్వచ్చకీర్తులు
సుజన చంద్రులు - సుగుణసాంద్రులు
గురులు - సుతరులు
||చదువు||

రామునికి - విలువిద్య నేర్పెను
మౌని విశ్వామిత్రుడు
కృష్ణునే చదివించే
సాందీప జ్ఞాని పవిత్రుడు
ఎంత ఘనులకునైన గాని
గురువులే ప్రత్యక్ష దేవులు
||చదువు||

రాధాకృష్ణులు - రామకృష్ణులు
విశ్వకవులు - వివేకానందులు
శంకరులు - వేదవ్యాసులు
ఎందరెందరో జగద్గురువులు
||చదువు||

కోటి సూర్యులున్న - కోటి చంద్రులున్న
గురువు మాట లేకుండా - ఎద చీకటి పోతుందా?
జ్ఞానజ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించె
గురువే బ్రహ్మ గురువే విష్ణువు - గురువే మహేశ్వరుడు
ఆ త్రిమూత్రి రూపునకిదె వందనం
ఆ దరుంతరంగున కిదె వందనం
||చదువు||