గురిపెట్టిన మన గాండీవం

యువ భారత యుగోదయంలో
నవభారత మహొదయంలో
పూచిందొక అరున తరంగం
లేచిందొక క్రాంతి విహంగం
కంఠంలో విప్లవ రాగం

గమనంలో విద్యుద్వేగం
దేశానికి నవసందేశం
లోకానికి నూత్నాలోకం
త్యాగోజ్వల మహిమామండిత
రాగారుణ రక్తపతాకం

నవభారత హృదయాంబరమున
ప్రసరించిన మహేంద్ర వాసం
చైతన్యం జీవిత లక్ష్యం
స్వాతంత్ర్య అంతస్సాక్ష్యం
ప్రాచీ దిగ్ దృంగంచలంలో

రోజస్సుల చిలికే కిరణం
అజ్ఞాతం అతిక్రమించిన
ప్రజ్ఞామయ విజయ విహారం
కురుక్షేత్ర సంగ్రామానికి
గురిపెట్టిన మన గాండీవం