నా మనసుకి ప్రాణం పోసే నీ

పల్లవి

[అతడు]నా మనసుకి ప్రాణం పోసే నీ మనసుని కానుక చేసే
నిలిచావే ప్రేమను పంచి ఓ...||2||
[ఆమె]నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి
మదిగది తెరిచి పక్కేపరచి
ఉన్నావు లొకం మరచి ||నా మనసుకి||


చరణం 1


[అతడు]నీ చూపుకి సూర్యుడు చలువాయే
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయె
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయె మాయే మాయే
నీ అడుగుకి ఆకులు పువ్వులాయే
నీ కులుకుకి కాకులు కవులాయే
నీ కలలకి నీ కధలకి కధలాడే హాయే హాయే
[ఆమె] అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి నా మనసనే ఒక
సరస్సున అలజడులే సృష్టించావే ||నా మనసుకి||


చరణం 2


[అతడు]ఒక మాట ప్రేమగా పలకాలి
ఒక అడుగు జతపడి నడవాలి
ఆ గురుతులు నా గుండెలో ప్రతి జన్మకు పదిలం పదిలం
ఒకసారి ఒడిలో ఒదగాలె యెదపైన నిదరే పోవాలె
తియ్య తియ్యని నీ స్మృతులతో బ్రతికేస్తా నిమిషం నిమిషం
[ఆమె ]నీ ఆశలు గమనించానే నీ ఆతృత గుర్తించాలే
లెక్కతేలకా బడులియ్యకా మౌనంగా చూస్తూన్నాలే