ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ

పల్లవి

[ఆమె]ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా సో సెక్సీ
ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా యు టచ్‌మి
[అతడు]కళ్ళలో స్వర్గం నువ్వే గుండెలో నరకం నువ్వే
మాటలో మధురం నువ్వే గోతులో కల్లెం నువ్వే
నాప్రేమ గాధ నువ్వే ఓ చెలియా చెలియా
ప్రియమైన భాద నువ్వే
నా ప్రేమ జ్వాల నువ్వే ఓ సఖియా సఖియా
మదిలోనా జ్వాల నువ్వే ||ఓ బేబి||

చరణం 1

[అతడు]పువ్వయి పువ్వయి పరిమళించినావే
ముళ్ళై ముళ్ళై మనస్సు దోచినావే
మెరుపై మెరుపై వెలుగు పంచినావే
పిడుగై పిడుగై కలలు కూల్చినావే
[ఆమె]ప్రేమకి అర్థం అంటే కన్నీట్లో పడవేనా
ప్రేమకి గమ్యం అంటే సుడిగుండంలోకేనా
[అతడు]చింతల్లోనే ఉందంటా చేలగట్టు ఈ ప్రేమా
కనుకా మతిపోయి ప్రేమించానమ్మా
కనుకా మూల్యాన్ని చెల్లించానమ్మ
నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియా చెలియా
ప్రియమైన భాద నువ్వే
నా ప్రేమ జ్వాల నువ్వే ఓ సఖియా సఖియా
మదిలోన జ్వాల నువ్వే

చరణం 2

[అతడు]నువ్వే నువ్వే ఆదరించినావే ఆపై ఆపై చీదరించినావే
నిన్నే నిన్నే ఆశ్రయించగానే నాలో నాలో ఆశ కొచ్చినావే
కోవెల లోకం కూడా నా తనువుని కాల్చిందే
దేవత మెళ్ళో హారం ఉరితాడై బిగిసిందే
ప్రేమ పైనే నమ్మకం కోల్పోయానే ఈ క్షణం
ప్రేమ పని లేని చోటుకి వెళ్ళాలి
నువ్వు కనలేని గూటికి చేరాలి ||ఓ బేబి||