వినుడు వినుడు రామాయణగాధా

వినుడు వినుడు రామాయణగాధా వినుడే మనసారా
ఆలపించినా ఆలకించినా అనందమొలికించే గాధా
శ్రీరాముని రారాజు సేయగ కోరెను దశరధ భూజాని
పుఒరులెల్ల ఉప్పొంగి పోయిరా మంగళవార్తవిని
కారుచిచ్చుగామారెనుకైక మందర మాటవిని
||వినుడు||

అలుకతెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరముల ఆ తల్లీ
సలుపవలయు పట్టాభిషేకము భరతునికేవి పృధివి
మెలగవలయు పదనాలుగేడులూ రాముడు కారడవీ
చెలియమాటకుఔనూకాదనీ పలుకడు భుజాని కూలే భువిపైని
||వి||

కౌసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లీ
మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి
దోసమనివెనుదీసె తమ్ముని రాముడు నయశీలి
వనవాసదీక్షకు సెలవుకోరె - పినతల్లి పదాలవ్రాలి ఓ
||వి||

వెడలినాడు రాఘవుడు అడవికేగగా
పడతి సీతసౌమిత్రితోడు నీడగా
గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నదీ
వీడకుమా మనలేమని వేడుకున్నదీ
అడుగులబడి రాఘవా ఆగమన్నదీ
అడవీ అడవి కన్నీరై అరయుచున్నదీ
||వి||