కోయిలొచ్చింది

కోయిలొచ్చిందమ్మ

కోయి లొచ్చింది.

చలి వదలి పోగానే

సాగి వచ్చింది.

గున్న మామిడిపైని

కొలువు తీర్చింది.

'కూ' అంటు కమ్మగా

గొంతు విప్పింది.

గానాల సుధలతో

కడలు నింపింది.

కోయిలమ్మకు తెలుసు

కోటి రాగాలు.