నిలువమని నన్ను అడగవలెనా

పల్లవి

నిలువమని నన్ను అడగవలెనా నిలువకుండా
పోతివి అలనా ఓర చూపుల చినదానా, ఒక్కసారి
రావే లలనా,
నిలువవె వాలు కనులదానా, వయ్యారి హంస
నడకదానా, నీనడకల హొయలున్నవె జానా
నువ్వు కులుకుతూ గలగల నడుస్తూంటే నిలువదె
నా మనసు ఓ అలనా అది నీకే తెలుసు
||నిలువవె||


చరణం 1


ఎవరని ఎంచుకొనినావో వరుడని బ్రాంతి
పడినావో ఎవరని ఎంచుకొనినావో బ్రాంతి
పడినావో సిగ్గుపడి తొలగేవో విరహగ్నిలో నను
తోసి పోయేవో ||నువ్వు కులుకుతూ||


చరణం 2


ఒక్కసారి నన్ను చూడరాదా, చెంత చేర
సమయమిది కాదా ఒక్కసారి నన్ను చూడరాదా
సమయమిది కాదా చాలు నీ మర్యాద వగలాడివే,
నీ వాడనే కానా ||నువ్వు కులుకుతూ|| ||నిలువవె||