మన ఐక్యత కాపాడాలి

తెలుగు పతాకం యెగురని దిశయే లేదు తెలుగు దివ్వె వెలుగనట్టి దిశయే లేదు
తెలుగు వెలుగు చేరలేని దేశం లేదు తెలుగు వెలుగు దూరలేని కోశం లేదు
వేయి స్తంభముల గుడిని వెలయించిన చేతులు వేయి యేండ్ల మన గాధలు
వినిపించే గీతలు కాకతి రుద్రమను మరువగలుగునెవరు? సోదరీ
రాయల పౌరుషము మరువరాదెన్నడు సోదరా!

నాగార్జునాచార్య నవ బోధనలోన నరుల నాగరకతయే నాట్యమాడేనులే
నందికొండ శిల్పాలకు నతు లొనరించాలి సుందరమగు రామప్పకు వందే అనాలి
గోదావరి తీరంలో కో అంట్తే చాలును నా దేశం వైభవము నాదాలై వినబడును
కృష్ణానది తరంగాల తృ ష్ణతీర్చు సుధాఝురులు నాగార్జున సాగరాన నాట్యమాడు
తరంగాలు తిరుపతి కొండకు పోయి తిరుమలేశు పూజిస్తే పరమ భాగవతుల కిహము
పదము కరతలా మలకము శ్రీశైలం మల్లన్నను సేవిస్తే చాలును చింతలన్ని తొలగిపోయి
జీవితమే విరబూయును నన్నయ పద్యమ్మొక్కటి నాల్క మీద ఉన్న చాలు అన్ని విద్య

లొకసారె ఆకళించినట్లును తిక్కన పద్య మొక్కటి చక్కగ చదివిన చాలు తెలుగు జాతి
నుడికారము తెలిసికొన్నయటలన్ పోతన పద్య మొక్కటి ప్రీతిగ చదివిన చాలును
అమృతమునే రుచిచూచిన అనందము కలుగును విశ్వదాభిరాముడైన వేమన
అటవెలదిలో విశ్వమెల్ల ఇమిడిపోయి వేదాంతం విరియును త్యాగరాజ కీర్తనతో
తాదాత్మ్యం పొందితే సంగీతం హృదయంలో జడివానై కురియును కలకాలం మన
ఐక్యత కాపాడాలి తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టాలి