కృష్ణా గోదావరులు

తెలుగు దేశమే నాది తెలుగు బిడ్డనే నేను తెలుగు పేరు వింటేనే
మురిసిపోతాను తెలుగు భాష అంటే మైమరచిపోతాను నన్నయభ
ట్టిక్కడనే పుట్టినాడు తిక్కన కవి గంట మిచట పట్టినాడు పోతన్నలు
శ్రీనాధులు రామరాహు భూషణులు తెలుగు భాషకై వన్నెలు దిద్దినారు
తెలుగు జాతి నాల్కలపై నిలిచినాడు ఆట వెలదులను ముద్దుల మూటగట్టె

వేమన్న భవి కాలగతుల తెలియ బల్కెలు విరబ్రంహం కర్ణాటక గానానికిం
కళదెచ్చెను త్యాగరాజు ఇంతటి విజ్ఞాన ధనులు ఎవరున్నారు వెదకి చూచినా
గాని కానరారు బరిపై తొడగొట్టి కత్తి బట్టెను నాయకురాలు పురుష వేషమున
శత్రుల కుమారుమాడెను రుద్రమ్మ మొల్లలు మల్లమ దేవులు మహిళలకే
మణిపూసలు తెలుగు గడ్డకే పేరు దెచ్చినారు స్త్రీ జాతికి గౌరవమ్ము నిచ్చినారు

ఓరుగల్లు నేలిన శూరుడు ప్రతాపరుద్రుడు పౌరుషమ్ము చింధించిన బాలచంద్రుడు
రాచకొండ వెలను దొరలు కొండవీటి రెడ్డి విభులు మన ప్రతాపమునకు బలే మచ్చు
తునకలు వేడి నెత్తురు పారించిన వీరపుత్రులు కలియుగ భీముడని బిరుదు గొన్న
కోడి రామమూర్తి అద్భుత మేధావిగా పేరందిన విశ్వేశ్వరయ్య జగము మెచ్చు రాధాకృష్ణ
త్యాగమూర్తి ప్రకాశం గత్యసాయి బాబాలు మనవాల్లంటే చాలు సింహాచల మప్పన్న శ్రీఈశైలం
మల్లన్న యాదగిరి నరసింహ ఏడుకొండల వెంకన్న వీరంతా తెలుగువారి కిలవేలుపులు
మహిమలు జూపించునట్టి మన దేవుళ్ళు కృష్ణా గోదావరులు కేరింతలు గొడుతున్నవి

తుంగభద్ర మంజీరలు అంగలు వేస్తున్నవి నిత్యము ప్రవహించుచున్న నిర్మలమగు
జీవనదులు బంగారపు పంటలు వపండిస్తున్న వీ కరువు రక్కిసిని దూరం తరుముతున్నవీ
తెలుఇగువాడు ఏడ నున్న తెలుగువాడు తెలుగు బాషనే సొంపుగ పలుకుతాడు మరచిపోని
అతని కట్టు మారిపోని అతని బొట్టు తలచుకున్న రోమ రోమం పులకరిస్తుంది అభిమానం
పొంగిపొరలి ఉరకలేస్తుంది