పల్లవి
[ఆమె] ఒక నేస్తం కావాలి తన ప్రెండ్‌షిప్ కావాలి అవధుల్లేని ఆనందాలకి అర్థం
కావాలి పరిమితి లేని ఆలోచనలకి ప్రాణం కావాలి ఇదివరకెన్నడు పరిచయమవ్వని
ఇకపై ఎప్పుడు దూరం కాని నాకు కొత్త లోకం కావాలి
[అతడు] ఒక నేస్తం కావాలి తన ప్రెండ్‌షిప్ కావాలి రాకెట్‌లోన అలలుగా ఎగసే
సంఘం కావాలి పాకెట్ వెనుక మనసున్న నిమిరే బంధం కావాలి ఇదివరకెన్నడు
పరిచయమవ్వని ఇకపై ఎప్పూడు దూరంకాని నాకు కొత్తలోకం కావాలి||ఒక నేస్తం||
చరణం 1
[ఆమె] తాను మేఘంలాగా రావాలె నేను భూగోళంలా మారాలె రంగుల వర్షంలో
ప్రతి గడియగడపాలె పరిమళ వర్షంలో ప్రతి క్షణము తడవాలె నా నిమిషాలన్నీ
మెరుపులు చేసె గంటలు తేనెల పంటలు చేసి క్లోజుగానేమో ఎదురుగా నిలిపే దోస్త్
కావాలె ఏదో కావాలి ఇంకేదో కావాలి ఏదో చెయ్యాలి ఇంకేదో ఏదో ఏదో ||ఒక నేస్తం||
చరణం 2
[అతడు] తాను రాగంలాగా రావాలె నేను అనురాగంలా నిలవాలె గీతలు మారేలా
ఓ గీతం పాడాలె తీరులు కలిసేలా ఓ తీరం చేరాలె నా కమ్మని కలలకు డ్రైవింగ్ తానే
తుంటరి మనస్సుకు ట్యూనింగ్ తానే జీవితకాలపు సింధని లోకాన కంపెని కావాలె
ఏదో కావాలె ఇంకేదో కావాలె ఏదో చెయ్యాలి ఇంకేదో ఏదో ఏదో ||ఒక నేస్తం||