తిరుమల మందిర సుందరా

తిరుమల మందిర సుందరా
హరి గోవిందా గోవిందా
కొండ కొమ్ముపై కూర్చుంటే నీ
దండ భక్తులే కొలువుంటే
నా మాట నీ చెవుల పడుతుందా నీ
మనసున దయపుడుతుందా
||గోవిందా||

కోటిమెట్లబడి రాలేను ఏ
పాటి కానుకలు తేలేను
లోతుల నీకై చేతుల జాపి
నా తండ్రీయన నెనరుందా
||గోవిందా||