తెనుగు తల్లీ! నీకు జోహారు
దేశమాతా! నీకు జేజేలు
నిను జూచి నిను బాడి నిను గొల్పు వేళ నా
కను లాణిముత్యాల గనులుగా నగు నహొ!
తెనుగు తల్లీ! నీకు జోహరు
దేశమాతా! నీకు జేజేలు
నీ పాలు జుంటి తేనియల తేటలో గోస్త
నీ పక్వరసమో సుధా పురమో యోట
నా పల్కు లీ లీయనకు నోని విశ్వవా
ణీ ప్రపంచ ప్రశంసాపూరితము లాయె ||తెనుగు||
కుటిల శాత్రన కోటిగుండెలో నిదురించి
యిటు సేతు సటుగంగ యెల్లంగా జగమేలు
నటరాజ కంఠవైల్యము నడగించు
నటుకీర్తి పెంచె నట్టి యెంతటి వాడో ||తెనుగు||
ఎల్లోర కొండ నీ యల్లారు గీమటీ
కొల్లూరి కోహినూరు కొప్పులో బూచటీ
కోలారు గనులు నీ కోశంబటీ పండ్లు
పుల్లనైపోవు భోగమ్ము కన్నచో ||తెనుగు||
గౌతమీ కృష్ణనదీ తుంగభద్రాది
వూత స్రవంతికా పుంజమ్ము నీ ముద్దు
కూతురై నీ చను నీ తోట పండింప
నీ తనూజులు పైడి పాతఱల్ కప్పిరే ||తెనుగు||
నీ పుణ్యలేశమ్ము నాపాలి దాయనో
నా పూజకే లోకనాధుండు పొంగెనో
నీ పావనోదర శ్రీపరంపరలలో
నీ సదార్చనులలో నేను నొక్కడనైతి ||తెనుగు||