[నందీశ్వరుడు బృందం] ఓం నమశ్శివాయ
[నంది] శ్లోకం
నమస్సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే
ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారినం
నమోస్తుదేవదేవాయ మహాదేవాయ వేధసే
శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే
[నంది] హరహమహదేవా శంభో
అక్షయ లింగ విభో స్వయంభో
[బృందం] హరహరమహాదేవా శంభో
[నంది] ఈరేడు జగములు నిను పూజింప
ఎవరిని నీవు ధ్యానింతువయ్యా
కనులు మూసి కూర్చున్న స్వామీ
సగము తెరచి దయజూపవదేమీ
పలు పాపాల శాపాల హుంకారము
తొలగజేయును ఓంకారము
వినుతిసేయ ఏ పాటి వారము
మహిమ కలది గద! నీదు నామము