నీ స్టైలే నాకిష్టం నీస్మైలే నా ప్రాణం

పల్లవి

[ఆమె] నీ స్టైలే నాకిష్టం నీస్మైలే నా ప్రాణం నువ్వు నాకోసం ఇక సంతోషం
[అతడు] అంతొద్దులేమ్మా నీ స్నేహం చాలమ్మా నువ్వు నా బందం ఇది ఆనందం
[ఆమె] తెలిసి తెలియని నా మనస్సే తరుముతున్నది నీకేసి

చరణం 1

[ఆమె] నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా
పలకకున్నా సరే నీపై మోజు కలిగేనురా
[అతడు] అందరి తీరుగా నేను తెలుగు కుర్రాడ్నిగా
ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమ చాలికా
[ఆమె] నీ మగసిరి నడకలోనా తియ్యని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్ద చేసే
[అతడు] పగలే కలలు కంటున్నావా కలవరింతలో ఉన్నావో
ఊహలంటి బైటకు రావమ్మో
||నీ స్టైలే||


చరణం 2


[ఆమె] నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా
సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా
[అతడు] ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడు
నమ్మక తప్పదు నిన్నే చూశా ఇప్పుడు
[ఆమె] నీ కంటి బొమ్మల విరుపు నీచులపై కొరడా జరుపు
అది నీపై వలపు కలిపెరా
[అతడు] పువ్వంటి హృదయంలోనా తేనెంటిమనస్సే నీది నీ ప్రేమకు ఇదిగో జోహారే
||నీ స్టైలే||