జగదభిరామా! రఘుకులసోమా!
శరణము నీయవయ్యా! కరుణను జూపవయ్యా!
కౌశిక యాగము కాచితివయ్యా!
రాతిని నాతిగ జేసితివయ్యా
హరువిల్లువిరచి మురిపించి సీతను
పరిణయమాడిన కళ్యాణరామా
ఒకటే బాణం ఒకటేమాట
ఒకటే సతియని చాటివయ్యా
కుజనులనణచీ సుజనుల బ్రోచే
ఆదర్శమూర్తివి నీవయ్యా
జయజయరాం - జాశ్నకిరాం
పావనరాం - మేఘశ్యాం
కానలకేగీ కాంతను బాసి
ఎంతో వేదన చెందితివయ్యా
అంతేకానీ చింతలనెన్నో
ఎంతఓర్చావు రామయ్యా