నీలమేఘ చ్చాయ బోలుదేహము వాడు

[పద్యం] నీలమేఘ చ్చాయ బోలుదేహము వాడు
దవళాబ్జ పత్ర నేత్రముల వాడు
కంబు సన్నిభమైన కంఠంబుగలవాడు
బాగైనయట్టి గుల్భముల వాడు
తిన్ననై కనపట్టు దీర్ఘ బాహుల వాడు
ఘనమైన దుందుభి స్వనము వాడు
పద్మరేఖలుగల్గు పద యుగంబులు వాడు
చక్కని పీన వక్షంబు వాడు
కపట మెరుగని సత్యవాక్యముల వాడు
రమణి రాముండు శుభలక్షణముల వాడు
యిన్ని గుణముల రూపింప నెసగువాడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు