పల్లవి
[అతడు] నన్నే నన్నే చూసూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో...ఏదో...ఏదో...చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ...నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో...అమ్మో...ప్రాణం తియ్యొద్దే
[ఆమె] నీకో నిజమే చెప్పగ నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి తిల్లానా నాలో ఏదో అల్లరి
అది నిన్నా మొన్నా లేనిదీ మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
ఏమిటంటారు...ఈ మాయల్ని ఎవరినడగాలి...ప్రేమేనా అని
చరణం 1
[అతడు] ఇదివరకెరగని స్వరములు పలికెను
పగడపు జిలుగుల...పెదాల వీణా
బిడియము లెరుగని...గడసరి సొగసుకు
తమకము లెగసెను...నరాలలోనా హలోనా
[ఆమె] ఏమైదో ఏమిటో...ప్రేమైందో ఏమిటో
నావాటం మొత్తం మారిందీ
ఈమైకం ఏమిటో...ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరిందీ
చరణం 2
[అతడు] మనసున అలజడి...వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల...చలాకిమైనా
కలలను నిజముగ...ఎదురుగ నిలిపిన
వరముగ దొరికిన...వయ్యారి జాణా బాణా
[ఆమె] ఈలోకం కొత్తగా...ఉందయ్యో బొత్తిగా
భూగోళం కూడా...నేడే పుట్టీందీ
నీవల్లే యింతగా...మారాలే వింతగా
నువ్వంటే నాకు...పిచ్చేపట్టిందీ