ఓలా ఓలాల ఓల ఓలా ఓసారి

పల్లవి

[ఆమె] నువు ముట్టుకుంటే నేతట్టుకుంటాను నువు పట్టుకుంటే నేచుట్టుకుంటాను
మర్చిపోతే నేచచ్చిపోతా
నువు విచ్చిగుంటే నేవిచ్చుకుంటాను నువు పచ్చిగుంటే వెచ్చ వెచ్చ గుంటాను
నువు మెత్తగుంటే మెత్త మెత్తగుంటా
[అతడు] ఓలా ఓలాల ఓల ఓలా ఓసారి చెయ్యి వేస్తే కోలా
ఓలా ఓలాల ఓల ఓలా పూలెక్కివుంది కోకకోలా
ఓలా ఓలాల ఓల ఓలా సయ్యంది చిన్నదాని సీల
[ఆమె] నాగమల్లి నాగమల్లి


చరణం 1

[ఆమె] చెప్పకుండ చెయ్యిలాగితే చెంపమీద చంపకోరత
అప్పనంగ అందమడిగితే అప్పడంగ నేనుమారుతా
[అతడు] తళుక్కుమంటే తుళ్ళిపడ్డకూనా తళుకుమంది కుర్రగొంతులోనా
కడుపుతుంటే కంటిసైగతోనా కడుపు ఆగేనా ఓలఓలాఓలా ఓలా


చరణం 2

[ఆమె] సున్నిపిండి ముందరుంచితే స్నానమై నీకు అందుతా
సున్నితంగ నన్ను తాకితే సుబ్బరంగ నీకు చెందుతా
[అతడు] చిటుక్కుమంటే జింగిలాల జాన లటుక్కుమంటు లొంగదీసుకోనా
వొణుకుతుంటే ఇంతవేడిలోన దినక్ దింతాన ||ఓలఓల||