డోలు బాజా ఆటల్లో నీవే కేడివంటా

పల్లవి

[అతడు] డోలు బాజా ఆటల్లో నీవే కేడివంటా శివశంకరా
ఈలవేసి గగ్గోలు చేసే ఆటనాది దీవించరా
కాళేశ్వరా హర నీ కాలి అందె భాగ్యమేదో నాకివ్వరా
నీముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించరా
అహ ముక్కంటి నువ్వే దిక్కంటి శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
రారా గౌరీ ప్రాణేశ్వరా
ఇక నా గుండె కాగా నీ వెండి కొండ ఉండిపోరా లోకేశ్వరా
డోలేరే డోలేరే డోలేరే డోలేరే


చరణం 1


[అతడు] నీ శిరస్సు పైన ఏమున్నది చందమామ వెలుగున్నది
నీ గొంతుపైన ఏమున్నది నీలి రంగు నీడున్నది
అరె ఢం ఢం డమరుకమలు చెప్పేయి నీలో వెలుగు నీడ కలిసున్నది
గట్ గట్ కుదుపు భయము ఉండద్దు అంటూ
నీలో ఉన్నా సత్యాన్ని కంటున్నా
[కోరస్] హర హర మహదేవా శివశంకరా ||2||


చరణం 2


[అతడు] నీకంటిలోనా నిప్పున్నది భగ్గుమంటె బొగ్గయితది
ఆ అగ్గినాపే దేమున్నది గంగ నీకు తోడున్నది
అరె బం బం డమరికణము అంటున్నది నీలో నీరు నుప్పు కూడున్నది
మరి గం గం మనిషి మనిషి కలిసుండాలంటూ
నీవే చెప్పే వేదాన్ని వింటున్నా ||డోలు||