ఆ... ఆట... ఆ... ఆట...

[అతడు] ఆ... ఆట... ఆ... ఆట...
జెండాప కపిరాజుంటే రధమాపేదెవరంట
గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట

పల్లవి

[అతడు] అల్లావుద్ధిన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
అల్లదిగో ఆశలద్వీపం కళ్ళెదుటే ఉందంట
ఎల్లలనే తెంచేవేగం మేఘాలు తాకాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట

చరణం 1

[అతడు] ముందుగా తెలుసుకో మునిగే లోతెంత
సరదాగా సాగదు బేతా నట్టేట ఎదురీత
తెలివిగా మలుచుకో నడిచే దారంత
పులిమీద స్వారీ కూడ అలవాటు అయిపోదా
సాదించే సత్తా వుంటే సమరం ఒక సయ్యాట
తల వంచకు రావలసిందే ప్రతి విజయం నీవెంట ||అల్లా||

చరణం 2

[అతడు] చెలిమితో గెలుచుకో చెలితో వలపాట
అతిలోక సుందరి రాదా జతకోరి నీవెంట
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాట
జగదేక వీరుడు కూడ మనలాంటి మనిషంట
ఇటునుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా
దివినుంచే దిగిరాలేదు మనతారాగణమంతా
మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా
పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా ||ఆట ఆట||