చక్కెరకేళి పండు చక్కెరకేళి

పల్లవి

[ఆమె] చక్కెరకేళి పండు చక్కెరకేళి పండు నా తోడు నీడై నువ్వుండు
[అతడు] పిప్పరమెంటు పిల్లా పిప్పరమెంటు పిల్లా నాఈడు జోడై నువ్వుండు
[ఆమె] తోలిప్రేమ నేడు నీ పేరు రాదా పిలిచింది చూడు నిజంగా నిజంగా
[అతడు] మనసైన వాడు చెయ్యందుకోగా ముందే ఉన్నాడు నిజంగా నిజంగా
[ఆమె] ఆ మాటే మళ్ళీ అను ||చక్కెర కేళి||

చరణం 1

[ఆమె] నేనంటే నువ్వంటూ చేతల్లో చూపెట్టు నా మనసు నమ్మేట్టుగా
[అతడు] నాలోనే నువ్వుంటూ నేనన్ను దీవింతు సందేహమా వింతగా
[ఆమె] వద్దనుకున్నా నేను ఊపిరిలా ఉంటాను
[అతడు] ఇద్దరమంటూ లేనేలేమని నేనంటున్నాను

చరణం 2

[ఆమె] రాకాసి చూపుల్తో నాకేసి చూస్తావేం నేనరిగిపోనా మరీ
[అతడు] మారాణి నువ్వుల్తో ప్రాణాలు లాగేసి గారాలు పోకే మరీ
[ఆమె] సర్లే కానీ బాబూ ఈ సారికి ఇలా కానివ్వు
[అతడు] ఇప్పుడు ఎప్పుడు తప్పని సరిగా చేస్తాలే తప్పు ||చక్కెర కేళి||