పల్లవి
నిలువమని నన్ను అడగవలెనా నిలువకుండా పోతివి లలనా ఓర చూపుల
చిన్నాదానా ఒక్కసారి రావే లలనా నిలువవె వాలు కనులదానా వయ్యారి హంస
నడకదానా నీ నడకల హొయలున్నవె జానా నువ్వు కులుకుతూ గలగల
నడుస్తూంటే నిలువదె నా మనసు ఓ లలనా అది నేకే తెలుసు ||నిలువవె||
చరణం 1
ఎవరని ఎంచుకొనినావో వరుడని భ్రాంతి పడినావో ఎవరిని ఎంచుకొనినావో భ్రాంతి
పడినావో సిగ్గుపడి తొలగేవో విరహాగ్నిలో నను తోసి పోయేవో||నువ్వు కులుకుతూ||
చరణం 2
ఒక్కసారి నన్ను చూడరాదా చెంతచేర సమయమిది కాదా ఒక్కసారి నన్ను చూడరాదా
సమయమిది కాదా చాలు నీ మర్యాద వగలాడివే నీ వాడనే కానా
||నువ్వు కులుకుతూ||నిలువవె||