పల్లవి
[అతడు] ఆగలేకపోతున్నా పదరా ఎందాకైనా
అడుగు తడబడుతున్నా తోడురానా
చెల్లి ఎడబాటైనా, కంట తడిపెడుతున్నా
గుండె ప్రతి లయలోనా నేను లేనా
ఒంటరైనా, ఒంటరైనా వెంట నడిచే నీడవేగా
ఓ మై ఫ్రెండ్
తడి కన్నులనే తుడిచెద నేస్తమా ఓమై ఫ్రెండ్
ఒడిదుడుకులలో నిలిచెద స్నేహమా
అమ్మ ఒడికి లేనిపాశం నేస్తమల్లే అల్లుకుంది
జన్మకంతా తీరిపోనీ మమతలెన్నో పంచుతుంది
మీరు మీరు నుంచి మన స్నేహగీతం
ఏరా ఏరా హల్లోకి మారెను
మొహమాటం లేనేలేని, కలచాలువారె, ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడ నీవే
ఓ మై ఫ్రెండ్ కన్నులనే తుడిచెద నేస్తమా
ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచెద స్నేహమా
చరణం 1
వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే
నిన్ను చూస్తే చిన్న నాటి చేతులన్నీ చెంతవాయె
గిల్లికజ్జాలను ఇలా పంచుకోకు,
తుళ్ళింతల్లో తేలే స్నేహం
మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందని
ఒంటరైనా ఓటమైనా
వెంట నడిచే నీడ నీవే స్నేహం ||ఓ మై||