అందమైన కుందనాల బొమ్మరా...

కింగ్‌ఫిషర్‌ బీరు ఓపెన్‌ చేయబోతే
ఓపెనర్‌ జారిపోయే
వీడి గుండె ఓపెనైపోయే
మెట్లు దిగి ఫాల్లో చేసి
కింద చూడబోతే
అంతలోనె మాయమాయే
అల్లంత దూరాన చుక్కలాగ మెరువగ
బైక్‌ వాడు స్టార్ట్‌ చేస్తే
రైలు గేటు దాటి వెళ్లిపోయే
వీడి గుండె గిల్లి వెళ్లిపోయే

పల్లవి

అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా ||2||
ఏ ఇంటి వనితో మరి
నా ఎదమీటి పోయే చెలి
ఏచోట ఉందో మరి
నా ప్రియమైన ఆ సుందరి ||అందమైన||

చరణం 1

అనుకోకుండానే నేను చూశాను
ఆమెను...
ఆపే వీల్లేక ఆమెతో పాటు
నా మనసును ||2||
ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను
చూడకుండా ఉండలేను ఏం చేయను
ఏమో.. ఏ మేడల్లో దాగి ఉందోరా ||అందమైన||

చరణం 2

ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో
కనబడి..
చూపుల వల వేసి తీసుకెళుతుంది
తన వెంబడి..
ఒక్కసారి చేరాలి ఆ నీడను
విన్నవించుకోవాలి ఈ బాధను
ప్రాణం... పోతున్నట్టుగా ఉందిరా ||అందమైన||