తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా...

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా
తేరులా.. సెలయేరులా.. కలకల.. గలగల..
కదలి వచ్చింది కన్నె అప్సర..
వచ్చి నిలిచింది కనులముందర... ||2||

చరణం 1

తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా ||2||
గోదారికెరటాల గీతాలవలె నాలో
పలికినది పలికినది పలికినది
చల్లగా.. చిరుజల్లుగా.. జలజల.. గలగల.. ||కదలి|| ||తేట తేట||

చరణం 2

రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి ||2||
లోలోన నాలోన ఎన్నెన్నో రుపాలు
వెలిసినవి వెలిసినవి వెలిసినవి
వీణలా.. నెరజాణల.. కలకల.. గలగల.. ||కదలి|| ||తేట తేట||