మౌనమె నీ భాష ఓ మూగ మనసా ||2||
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు ||మౌనమె||
చరణం 1
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటకరంగానివే... మనసా
తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ||2|| ||మనసా||
చరణం 2
కోర్కెల సెగ నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే... మనసా
మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ||2|| ||మనసా||