ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే...

అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ||2||
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే..
అర్ధాలే వేరులే.. అర్ధాలే వేరులే..

చరణం 1

అలిగి తొలిగి నిలిచినచో ||2||
చెలిమిజేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో ||2||
మరియాదగ పొమ్మనిలే ||ఆడువారి||

చరణం 2

విసిగి నసిగి కసిరినచో ||2||
విషయమసలు ఇష్టమెలే
తరచి తరచి ఊసడిగిన ||2||
సరసమింక చాలనిలే ||అడువారి||