సాకీ:
నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని
చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని
నాకు అనిపించింది నమ్మకం కుదిరింది
అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యిందీ
పల్లవి
పడ్డానండి ప్రేమలో మరి
విడ్డూరంగా ఉందిలే ఇది ||2||
నిజంగా... నిజంగా...
ఇలా ఈ రోజే తొలిసారిగా ||పడ్డానండి||
చరణం 1
ఈ కాంతలోన దాగి వుంది అయస్కాంతము
తన వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము
నీ చేతిలోన దాగి వుంది మంత్రదండము
నువు తాకగానె చెంగుమంది మగువ దేహము
ఇద్దరిదీ ఇదే స్థితి ఏమిటి ఈ పరిస్థితి ||2||
వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ ||పడ్డానండి||
చరణం 2
నా ఈడు నేడు పాడుతోంది భామదండకం
నా ఒంటినిండ నిండి ఉంది ఉష్ణమండలం
నాపాత పెదవి కోరుతోంది కొత్తపానకం
నా అందమంత చూపమంది హస్తలాఘవం
కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి ||2||
వయసులోన ఉన్నోళ్ళకు తప్పదీ స్వయంకృషి ||పడ్డానండి||