ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం ||2||
పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగి కెగసేనా ఆశలే రాలిపోయేనా ||ఇదేలే||
చరణం 1
ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగ చేసినదీ ద్వేషము
కధ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే కసిగా శిశువును కుమ్మితే ||2||
అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా ||ఇదేలే||
చరణం 2
విరిసీ విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా
అర్పేదెలా ఓదార్చేదెలా..
నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రువ్వితే ||2||
పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా ||ఇదేలే||