తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం ||తెలియని||
చరణం 1
కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము ||కలకల||
తీయని ఊహల ఊయలలూగి తేలే మానసము... ఏమో... ||తెలియని||
చరణం 2
రోజూ పూచే రోజా పూలు ఒలికించినవి నవరాగాలు ఆ... ||2||
పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం... ఏమో... ||తెలియని||
చరణం 3
అరుణ కిరణముల గిలిగింతలలో కరిగిన తెలిమంచు తెరలే తరలి ||2||
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి వెలుగే వికసించే... ఏమో... ||తెలియని||