అమ్మా లేదు నాన్నా లేడు...

అమ్మా లేదు నాన్నా లేడు
అక్కా చెల్లి తంబీ లేరు ఏక్‌ నిరంజన్‌
పిల్లా లేదు పెళ్లీ లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే
మావా లేడు ఏక్‌ నిరంజన్‌
ఊరే లేదు.. నాకు పేరే లేదు..
నీడా లేదు.. నాకే తోడూ లేదు..
నేనెవరికి గుర్తే రాను ఎక్కిళ్ళే రావసలే
పదిమందిలో ఏకాకినీ నాలోకమే వేరే
ఇరగేసినా.. తిరగేసినా..
నేనెప్పుడూ ఇహ ఒంటరివాణ్ణే ||అమ్మా||

చరణం 1

కేరాఫ్ ప్లాట్‌ఫాం సన్నాఫ్ బ్యాడ్ టైం ఆవారా డాట్ కాం
హే దమ్మారోదం టన్స్ ఆఫ్ ఫ్రీడమ్‌ మనకదేగా ప్రాబ్లమ్‌
అరె డేటాఫ్ బర్తే తెలియదే పెనుగాలికి పెరిగాలే
హే జాలీ జోలా ఎరగనే నా గోలేదో నాదే
తిన్నావా దమ్మేశావా అని అడిగేదెవ్వడులే
ఉన్నావా పోయావా అది చూసే దిక్కేడే ||పదిమంది|| ||అమ్మా||
తట్టా లేదు బుట్టా లేదు బుట్ట కింద
గుడ్డు పెట్టే పెట్టా లేదు ఏక్‌ నిరంజన్‌

చరణం 2

దిల్లీజ్‌ బాడీ పుల్లాఫ్‌ ఫీలింగ్ నో వన్‌ ఈజ్‌ కేరింగ్
దట్స్ ఓకే యార్ చల్తా హై నేనే నా డార్లింగ్
ఏ కాకా చాయే అమ్మలా నను లేరా అంటుందీ
ఓ గుక్కెడు రమ్మే కమ్మగా నను పడుకోబెడుతుందీ ఎహెయ్‌...
రోజంతా నాతో నేనే కల్లోనూ నేనేలే
తెల్లారితే మళ్ళీ నేనే తేడాలేనే లేదే ||పదిమంది|| ||అమ్మా||
కిస్సూ లేదు మిస్సూ లేదు కస్సు బుస్సు
లాడే లస్కూలేదు ఏక్‌ నిరంజన్‌