నువ్వేంమాయ చేశావొ గాని...

నువ్వేంమాయ చేశావొ గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
నువ్వేంమాయ చేశావొ గాని ఇలా ఈ క్షణం ఆగిపోని ||2||
హాయిరే హాయిరే హాయ్ అందని రేయి చాటు రాగం విని
ఎవరు తనని పిలిచారని అడిగి చూడు నీ మనసుని
హే.. కాలాన్నే కదలనీయని కనికట్టేం జరగలేదని
ఈ తీయని మాయ తనదని తెలుసాఅనీ
మనసూ నీదే మహిమా నీదే
పిలుపూ నీదే బదులూ నీదే ||నువ్వేంమాయ||

చరణం 1

మూగ మనసిది ఎంత గడుసుది నంగనాచి సంగతులెన్నో వాగుతున్నది
ఓహో ఇంత కాలమూ కంటి పాపలో కొలువున్న కల నువ్వే అంటున్నది ||హాయిరే||
ఎందుకులికి పడుతుందని అడిగి చూడు నీ మనసుని
హే.. నిదురించే నీలి కళ్ళలో కల ఎప్పుడు మేలుకున్నదో
ఆ కలఏం వెతుకుతున్నదో తెలుసాఅనీ
కనులూ నీవే కలలూ నీవే ||పిలుపూ||

చరణం 2

పిచ్చి మనసిది ఆ.. ఎంత పిరికిది నచ్చుతానొ లేదో నిన్ను అడగమన్నది
ఓహో ఆశ ఆగక అడుగు సాగక అలలాగ ఎగిరెగిరి పడుతున్నది ||హాయిరే||
దాని పరుగు ఎటువైపని అడిగి చూడు నీ మనసుని
హే.. ఏ దారిన సాగుతున్నదో ఏమజిలీ చేరుకున్నదో
ఏ తీరం కోరుతున్నదో తెలుసాఅనీ
పదమూ నీదే పరుగూ నీదే ||పిలుపూ||