తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా.. మనసా.. ఇది ఏజన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు
చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి
చూడలేని జతిలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది ||తెలుసా||
చరణం 1
ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే.. నీవుగా.. ప్రాణమే.. నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ ||తెలుసా||
చరణం 2
darling, every breath you take
every move you make I will be there
what would I do without you?
ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే.. మారినా.. కాలమే.. ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ ||తెలుసా..||