అయామ్‌ వెరీ సారీ అన్నాగా ముందోసారి

అయామ్‌ వెరీ సారీ అన్నాగా ముందోసారి
సరదాగా నవ్వేసెయ్‌ ఒకసారి ||2||
హయో హయో హయో
పెదాలలా బిగించి శపించకే మరీ
మంత్రాలవీ జపించి వదిలెయ్‌ క్షమించి
అరె పాపం చిరుకోపం నిజమేనా మేకప్పా
అరె పాపా సారీ చెప్పా ఓ మై గోల్డెన్‌ చేపా
ఫారెక్స్‌ బేబీ టైపా లౌలీ లాలి పాపా ||అయామ్‌||

చరణం 1

తరిమి తరిమి తరిమి
నిను ఏడిపించడంఎందుకా అని
అడిగావనుకో చెబుతా వింటావా మరి ||తరిమి||
సమ్మర్‌ గిమ్మర్‌ వింటర్‌ అంటూ
ప్రతీ రుతువుకో డిఫరెన్సూ
ఉన్నప్పుడే కద బాగుంటుంది
చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ
మరో కలర్ రాదా
అని డౌటుపుట్టి అది తీర్చుకుందుకే
తమషాగా ట్రైలేసి చూశానే బేబీ
అయామ్‌ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్‌ ఒకసారి ||2||

చరణం 2

లిప్‌స్టిక్‌ అవసరమైనా
లేనంతా ఎర్రగా పెదవి ఉండిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే ||లిప్‌స్టిక్‌||
టమాటొ పళ్ళకి డూపుల్లా
సుమారు సిమ్లా యాపిల్లా
ఉన్నావె పిల్లా నువు నిలువెల్లా
నీ బంగమూతితో పొంగనీయకే
బుగ్గలు బర్గర్లా
నన్నుండనీయకూరించితే అవి
నిజం చెప్పు నీ తప్పు కాదా అది
అయామ్‌ వెరీ సారీ అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్‌ ఒకసారి ||2‌||