ఆ... ఆహాహా... ||2||
ఓహో... ఓహో... ఓహో...
నిను చూడక నేనుండలేను ||2||
ఈ జన్మలో మరి ఆ జన్మలో ||2||
ఇక ఏ జన్మకైనా ఇలాగే ||నిను|| ||2||
ఓహోహో.. ఆహాహా.. ఆహాహా.. ఓహోహో..
అహాహా.. ఓహోహో.. ఓహోహో.. ఆహాహా..
చరణం 1
ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకొంటిని
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శృతి వింటిని
నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో ||2|| ||నిను చూడక||
చరణం 2
ఓహోహో.. ఆహాహా.. ఆహాహా.. ఓహోహో..
ఓహోహో.. ఆహాహా.. ఆహాహా.. ఓహోహో..
నీ జతగూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం ఎంత హృదయసంగమం ||2|| ||నిను చూడక||