బృందావనమున అందెల రవళులు చిందు వేసేదెందులకు

[అతడు] కృష్ణ హరే
[ఆమె] శ్రీ కృష్ణ హరే
హరే కృష్ణ హరే... ||3||
కృష్ణ హరే భజే కృష్ణ హరే... ||3||
కృష్ణ భజే...
[అతడు] బృందావనమున అందెల రవళులు చిందు వేసేదెందులకు
[ఆమె] గోవిందుని లీలా మకరందము అందరికీ అందించుటకు
అందరికీ అందించుటకు
[అతడు] గోకులమున ఏ కులమైన గోపాలుని కొలుచేదెందులకు
[ఆమె] కులము అని వ్యాకులము బాపు కొలువైవుంటానని తెలుపుటకు
[ఆమె] నల్లానల్లని మేఘం లాగా నడిచొస్తాడు ఎందులకు
[అతడు] చల్లని కరుణామృతధారలలో మనలను ముంచి వెళ్ళుటకు
మనలను ముంచి వెళ్ళుటకు
చెంగు చెంగుమని గోవుల మందలు పరుగులు తీసేదెందులకు ఎందులకు
చెంత చేరి గోవిందుని సన్నిధి పరమపదమ్మని చాటుటకు ||హరే కృష్ణ|| ||భజే కృష్ణ||
[అతడు] హరే...
[ఆమె] హరే...