అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే ||2||
జాడతడే.. అతడే.. అతడే.. అతడే
ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే
పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే ||2||
Life has made it stronger
It made him work a bit harder
He got to think and act a little wiser
This world has made him a fighter
చరణం 1
కాలం నను తరిమిందో శూలంలా ఎదిరిస్తా
సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా
నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ
జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ
పెను నిప్పై నివురును చీల్చుతూ
జడివానై నే కలబడతా ||పెను||
చరణం 3
చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు
తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు ||పెను||
తన ఎదలో పగ మేల్కొలుపుతూ
వొడి దుడుకుల వల ఛేధించుతూ
ప్రతినిత్యం కధనం జరుపుతూ
చెలరేగే ఓ శరమతడూ
Life started to be faster
made him had a little think smoother
He's living on the edge to be smarter
This world has made him a fighter