ఎక్కడ ఎక్కడ ఎక్కడ వుందో తారకా
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా
ఓహూ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా
నాకోసమే తళుక్కన్నదో.. నా పేరునే పిలుస్తున్నదో..
పూవానగా కురుస్తున్నదీ నా చూపులో మెరుస్తున్నదీ
ఏ వూరే అందమా ఆచూకీ అందుమా
కవ్వించే చంద్రమా దోబూచీ చాలమ్మా
చరణం 1
కులుకులో ఆ మెలికలూ మేఘాలలో మెరుపులూ
పలుకులో ఆ పెదవులూ మన తెలుగు రాచిలకలూ
పదునులో ఆ చూపులూ చురుకైన చురకత్తులూ
పరుగులో ఆ అడుగులూ గోదారిలో వరదలూ
నా గుండెలో అదో మాదిరీ నింపేయకోయ్ సుధామాధురీ
నా కళ్ళలో కలల పందిరీ అల్లేయకోయ్ మహాపోకిరీ
మబ్బుల్లో దాగుందీ తనవైపే లాగిందీ
సిగ్గల్లే తాకిందీ బుగ్గల్లో పాకిందీ
ఓహూ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
చరణం 2
ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
మెరుపునీ తొలి చినుకునీ కలగలిపి చూడాలనీ
ఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియనీ
ఎన్నాళ్ళిలా తనొస్తాడనీ చూడాలటా ప్రతీ దారినీ
ఏ తోటలో తనుందోననీ ఎటూ పంపనూ నా మనసునీ
ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకూ కుదురుందా
అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక