భలే భలే అందాలు సృష్టించావు

ఆ... నందన వనముగ
ఈ లోకమునే సృష్టించిన
ఓ... వనమాలీ!
మరచితివో మానవజాతిని దయమాలి

పల్లవి

భలే భలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం
ప్రభూ మాకేల ఈయవు ||భలే భలే||

చరణం 1

మాటలు రాని మృగాలు సైతం
మంచిగ కలిసి జీవించేను
మాటలు నేర్పిన మా నరజాతి
మారణహోమం సాగించేను
మనిషే పెరిగి మనసే తరిగి ||2||
మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు... ||భలే భలే||

చరణం 2

ఆ... ఆ... ఆ... ఆ...
చల్లగా సాగే సెలయేటివోలే
మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వలవోలే
అందరు ఒక్కటై నివసించాలి
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని ||2||
మంచిగ మానవుడే మాధవుడై
మహిలోన నిలవాలి... ||భలే భలే||