నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవులేక తావి నిలువలేదులే లేదులే ||2||
తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే
నేను లేని నీవు లేనె లేవులే లేవులే
చరణం 1
నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీమదిలో ||2||
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె ||2||
దూరదూర తీరాలు చేరువైపోయె ||తావిలేని||
చరణం 2
సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ ||2||
రంగులీను నీమెడలో బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినము రానున్నదిలే
ఓ... ||నన్ను వదలి||
చరణం 3
తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెల్లమెల్లగా నీవు రాగ
నీ మేని హొయలు నీలోని వగలు
నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలసి ఉయ్యాలలూగి
ఆకాశమే అందుకొనగా
పైపైకి సాగే మేఘాలదాటి
కనరాని లోకాలు కనగా
ఆహా ఓహో ఉహు ఆ... ఓ...
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే లేనులే
నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
విభాగములు:
- ఎ.యన్.ఆర్,
- సావిత్రి,
* ఘంటసాల,
* పి.సుశీల,
# యుగళ గీతాలు,
+ మంచి మనసులు(1962),
$ త - న