చూపుచాలు ఓ మన్మధుడ
ఆగనంది నా గుండె దడ...
తెలుసుకో సుందరా...
నా మనసులో తొందరా...
మాటచాలు ఓ మాళవిక
ఆగలేదు నా ప్రాణమిక...
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ...
కలుపుకోవా నన్ను నీలో
యుగయుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా ||చూపుచాలు||
చరణం 1
ఏరికోరి నీ ఎదపైన వాలిపోనిదే వయసేనా
తేనె తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా
నింగి జారి తళుకుల వాన
కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అద్భుతాన్ని
ఇలా దరికి పిలుచుకోనా...హే...
ఆడించు నన్ను పాడించు నన్ను
నీ హాయి నీడలో
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ... ||చూపుచాలు||
చరణం 2
ఆడ మనసులో అభిలాష
అచ్చ తెలుగులో చదివేశా...
అదుపు దాటి వరదయ్యింది
ఈ చిలిపి చినుకు వరసా... హే...
నన్ను నేను నీకొదిలేశా
ఆదమరుపులో అడుగేశా
అసలు కొసరు కలిపి తీసుకో
వలపు తలుపు తెరిచా
అనుకున్న కొన్ని
అనలేనివన్ని ఆరాలు తియ్యనా
తెలుసులే అందమా... నీ మనసులో సరిగమ... ||చూపుచాలు||