మావి చిగురు తినగానే కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే
మావి చిగురు తొడిగేనా ||2||
ఏమో... ఏమనునో గాని ఆమని - ఈవని ||మావి||
చరణం 1
తెమ్మెరతో - తారాటలా
తుమ్మెదతో - సయ్యాటలా ||2||
తారాటలా - సయ్యాటలా
సయ్యాటలా - తారాటలా
వన్నెలేకాదు పగలేకాదు ఎన్ని నేర్చినది
మొన్నటి పువ్వు ||2||
బింకాలూ - బిడియాలూ
పొంకాలూ - పోడుములూ
ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి ||మావి||
చరణం 2
ఒకరి ఒళ్ళు ఉయ్యాలా
వేరొకరి గుండె జంపాలా
ఉయ్యాలా - జంపాలా
జంపాలా - ఉయ్యాలా
ఒకరి ఒళ్ళు ఉయ్యాలా
వేరొకరి గుండె జంపాలా
ఒకరి పెదవి పగడాలో
వేరొకరి కనుల దివిటీలో ||2||
పలకరింతలో పులకరింతలో
ఏమో ఏమగునో గాని
ఈ కత మనకత ||మావి||