వయ్యారి గోదారమ్మ

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై ||వయ్యారి||

చరణం 1

నిజము నా స్వప్నం అహా
కలనో ఓహొ లేనో ఓహొ హొ
నీవు నా సత్యం అహా
అవునో ఓహొ కానో ఓహొ హొ
ఊహా నీవే ఆహహహా ఉసురుకారాదా ఆహా
మోహమల్లె ఆహహహా ముసురుకోరాదా ఆహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ
మువ్వగోపాలుని రాధికా
ఆకాశవీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా ||వయ్యారి||

చరణం 2

తాకితే తాపం ఒహొ
కమలం ఓహొ భ్రమరం ఓహొ హొ
పలికితే మైకం ఓహొ
అధరం ఓహొ మధురం ఓహొ హొ
ఆటవెలదీ ఆహహహా ఆడుకోరావే
తేటగీతి ఆహహహా తేలిపోనీవే
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని
యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింబాధరాల
సూర్యోదయాలే పండేటి వేళ ||వయ్యారి||