పయనించే ఓ... చిలుకా... ఆ...
పయనించే ఓ చిలుకా
ఎగిరిపో పాడైపోయెను గూడు ||పయనించే||
చరణం 1
తీరెను రోజులు నీకీ కొమ్మకు
కొమ్మా ఏ చోటు వదలి
ఎవరికీ వారే ఏదోనాటికి
ఎరుగము ఎటుకో బదిలీ
మూడు దినాల ముచ్చటయే... ||2||
ఈ లోకంలో మన మజిలీ
నిజాయితీగా ధర్మపధాన... ||2||
చనుమా ధైర్యమె తోడు... ||పయనించే||
చరణం 2
పుల్లా పుడక ముక్కున కరచి...
గూడును కట్టితివోయి
వానకు తడిసిన నీ బిగిరెక్కలు
ఎండకు ఆరినవోయి
ఫలించలేదని చేసిన కష్టము... ||2||
మదిలో వేదన వలదోయి
రాదోయి సిరి నీ వెనువెంట... ||2||
త్యాగమే నీ చేదోడు ||పయనించే||
చరణం 3
మరవాలి నీ కులుకుల నడలే...
మదిలో నయగారాలే ||2||
తీరని వేదన తీయని ముసుగే
శిరసున సింగారాలే
ఓర్వలేని ఈ జగతికి నీపై... ||2||
లేవే కనికారాలే
కరిగీ కరిగీ కన్నీరై... ||2||
కడతేరుటె నీ తలవ్రాలే ||పయనించే||
చరణం 4
గోడుమని విలపించేరే...
నీ గుణము తెలిసినవారు ||2||
జోడుగ నీతో ఆడిపాడి కూరములాడినవారు
ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే
ఎన్నడో తిరిగి ఇటు నీ రాక
ఎవడే తెలిసినవాడు ||పయనించే||