శేషశైలావాస శ్రీవెంకటేశా

శేషశైలావాస శ్రీవెంకటేశా
శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా...
శేషశైలావాస శ్రీవెంకటేశా...

చరణం 1

శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలుమంగకు అలుకరానీయకు ||2||
ముద్దు సతులిద్దరిని ఇరువైపుల జేర్చి ||2||
మురిపించి లాలించి ముచ్చటల తేల్చి ||శేషశైలావాస||

చరణం 2

పట్టుపానుపు పైన పవ్వళించర స్వామి ||2||
భక్తులందరు నిన్ను ప్రస్తుతించిపాడ
చిరునగవులొలుకుచూ నిదురించు నీ మోము ||2||
కరువుతీరా గాంచి తరియింతుమూ మేము ||శేషశైలావాస||