భలే తాత మన బాపూజీ...
బాలల తాత బాపూజీ ||2||
బోసి నవ్వుల బాపూజీ...
చిన్ని పిలక బాపూజీ ||భలే తాత||
చరణం 1
కులమత భేదం వలదన్నాడు
కలిసి బతికితే బలమన్నాడు
మానవులంతా ఒకటన్నాడు
మనలో జీవం పోశాడు ||భలే తాత||
చరణం 2
నడుం బిగించి లేచాడు
అడుగుముందుకు వేశాడు
కదంతొక్కుతూ పదం పాడుతూ
దేశం దేశం కదిలింది
గజగజలాడెను సామ్రాజ్యం...
మనకు లభించెను స్వరాజ్యం.. ||2||
చరణం 3
సత్యాహింసలే శాంతి మార్గమని
జగతికి జ్యోతిని చూపించాడు
మానవధర్మం బోధించాడు.. ఆ..
మానవధర్మం బోధించాడు
మహాత్ముడై ఇల వెలిశాడు ||భలే తాత||