గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ

గుండెచాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్న పాటుగా హంస లేఖలై ఎగిరి వెళ్లిపోనీ నిన్ను కలుసుకోనీ...
నిన్ను కలుసుకోనీ... విన్నవించుకోనీ... ఇన్నాళ్ల ఊసులన్నీ ||గుండె||

చరణం: 1

నీలిమబ్బులో నిలిచిపోకలా నింగి రాగమాల
మేలిముసుగులో మెరుపు తీగలా దాగివుండనేల
కొమ్మకొమ్మలో పూవుగా దివిలోని వర్ణాలు వాలగా
ఇలకు రమ్మని చినుకు చెమ్మని చెలిమి కోరుకోనీ
నిన్ను కలుసుకోనీ.... విన్నవించుకోనీ ఇన్నాళ్ల ఊసులన్నీ ||గుండె||

చరణం: 2

రేయి దాటని రాణివాసమా అందరాని తార
నన్ను చేరగా దారి చూపదా రెండు చేతులారా
చెదిరిపోని చిరునవ్వుగా నా పెదవి పైన చిందాడగా
తరలిరమ్మని తళుకులిమ్మని వలపు తెలుపుకోనీ
నిన్ను కలుసుకోనీ... విన్నవించుకోనీ ఇన్నాళ్ల ఊసులన్నీ ||గుండె||