సాకీ:
ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా ||2||
పల్లవి:
చల్లగ రావేలా.. మెల్లగ రావేలా.. ||2||
వినీలా మేఘమాలా వినీలా మేఘమాలా
నిదురపోయే రామచిలుకా ||2||
బెదిరిపోతుందీ కల చెదిరిపోతుందీ
చల్లగ రావేలా.. మెల్లగ రావేలా..
చరణం:1
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ ||2||
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ ||2||
ఏం..?
నిదురపోయే రామచిలుకా ||2||
బెదిరిపోతుందీ కల చెదిరిపోతుందీ
చల్లగ రావేలా.. మెల్లగ రావేలా..
ఓహో... ఓ ఓ ఓ... ఓహో... ఓ ఓ ఓ...
చరణం:2
ఆశలన్నీ తారకలుగా హారమొనరించీ
అలంకారమొనరించి
మాయచేసి మనసుదోచి
పారిపోతావా దొంగా పారిపోతావా
చల్లగ రావేలా.. మెల్లగ రావేలా.. ||2||