పల్లవి
[అతడు] మనసా వాచా మనసిస్తే మైసూర్‌ప్యాలస్ రాసిస్తా ||2||
[ఆమె] పనిలో పనిగా జతకొస్తే జైపూర్ ప్యాలస్‌చదివిస్తా
[అతడు] జిగిబిగి సొగసందిస్తే ఈ జగతిని బదులిస్తా
[ఆమె] ప్రియతమ పదవందిస్తే ఈ తుడివిరి ఎదిరిస్తా
[అతడు] రా . . . రా . . . రా . . . రా . . . ||పనిలో పనిగా||
చరణం 1
[ఆమె] కళ్ళతోటే కావలిస్తే కాళిదాసు నవలిస్తా
[అతడు] ఎదకు ఎదకు పడితే ఆ పెదవి పొదిగిపెడతా
[ఆమె] కంగులూరి చేరివస్తే కోహినూరు కొసరిస్తా
[అతడు] నడక మిడిసి పడితే ఓ . . . నడుము మడతా ముడతా
కృష్ణయ్యా వెన్నంటితే;
[ఆమె] నా చల్లని చెల్లించుతా
[అతడు] వనిత విను చెబుతా కధా ఆ . . . ||మనసా||
చరణం 2
[ఆమె] రాజులాగా రాసుకుంటే వైజయంతిమాలిస్తా
[అతడు] గడియగడువు పెడితేఆ . . . తడిసి కడివెడౌతా
[ఆమె] సాగరంలా కమ్ముకుంటే బ్రహ్మపుత్రా నదినిస్తా
[అతడు] కలసి మెలసి ఫోతే ఓ . . . మెరిసి కురిసి వెళతా
వాల్మీకిలా వేటాడితే
[ఆమె] ప్రేమాయణం వల్లించుతా
[అతడు] లలితా ముడిపడతా పదా . . . ||మనసా||
మనసా వాచా
విభాగములు:
- చిరంజీవి,
- రమ్యకృష్ణ,
* యస్.పి.బాలు,
* సుజాత,
# యుగళ గీతాలు,
+ ఇద్దరు మిత్రులు,
$ ప - మ