ఆదాబర్సే

పల్లవి

[అతడు] ఆదాబర్సే అందరి కాదాబర్సే
పాపం పుణ్యం రెండు బొమ్మబొరుసే హే ||ఆదా||
పాపానికి పోటీలు పుణ్యాలకి పోటీలు
నువ్వు భూమిన పడగానే తెరిచారోయ్‌ నీ ఫైలు
రోజూ ఓ ధిల్లింగున్న మంచిది మనదేలక్‌ ||ఆదా||

చరణం 1

గర్భాల పెరిగే పాపాయికి హొష్టర్‌ అనే జైలురా
ఉయ్యాల ఒదిలిన బుజ్జాయికి అడుగంటూ ఓ జైలురా
చిన్నబడి ఓ జైలు పెద్దబడి ఓ జైలు పెట్టు ఉద్యోగం ఓ జైలు
ఉల్లాస మింతింతై పోగేసి వచ్చాక
వేసవి అవుతుందోయ్‌ జైలు
జోహారు చేస్తే తీహారుకన్నా మలేషా గొప్పది ఈ జైలు ||ఆదా||

చరణం 2

ప్రేమల్లోపడ్డ పసివాళ్లకి కౌగిళ్లే ఓ జైలురా
ఇంకాస్త పిచ్చి ముదిరిందంటే మ్యారేజ్‌ ఓ జైలురా
సందు దొరికిందంటే సంసారమో జైలు
ఆపినా ఆగదు ఆరైనా
బాధ్యతల బరువెక్కి కూలబడిపోయాక
వల్లకాడేరా తుది జైలు
లవ్‌ గుర్తులన్న అన్నిటికన్నా మలేషా గొప్పది ఈ జైలు ||ఆదా||